తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రయాణిస్తున్న కారులో మంటలు..! - car

ఇటీవల కార్లు తగలబడిపోతున్న ఘటనలు మరవకముందే మరోకారు కాలిపోయింది. ఎండ వేడిమి, సాంకేతిక లోపాలు! కారణాలు ఏవైనా... కార్లు దగ్ధమవుతూనే ఉన్నాయి. తాజాగా పాలమూరు జిల్లాలో ఓ వాహనం తగలబడింది.

కారులో మంటలు

By

Published : Apr 24, 2019, 9:48 PM IST

మహబూబ్​నగర్ జిల్లా రాజాపూర్ వద్ద 44వ జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారులో మంటలు చెలరేగాయి. అందులోని వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. హైదరాబాద్ నుంచి స్కార్పియో వాహనంలో రంగాజీరావు కర్నూల్​ బయలుదేరాడు. రాజాపూర్ సమీపంలోకి రాగానే మంటలు వ్యాపించినట్లు గుర్తించాడు. వెంటనే కారులో నుంచి దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. క్షణాల్లో మంటలు వ్యాపించి కారు పూర్తిగా కాలిపోయింది. స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించగా.. వారు మంటలను అదుపులోకి తెచ్చారు. ఎండ వేడిమితో ఇంజిన్​లో మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

కారులో మంటలు

ABOUT THE AUTHOR

...view details