మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని మహబూబ్నగర్ డీఎస్పీ శ్రీధర్ ప్రారంభించారు. సేకరించిన రక్త నిధిని జిల్లాలోని 272 మంది తలసేమియా బాధితులకు ఉపయోగిస్తామన్నారు.
మహబూబ్నగర్లో రక్తదాన శిబిరం.. ప్రారంభించిన డీఎస్పీ.. - మహబూబ్నగర్ డీఎస్పీ శ్రీధర్
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని డీఎస్పీ శ్రీధర్ ప్రారంభించారు.
మహబూబ్నగర్లో రక్తదాన శిబిరం.. ప్రారంభించిన డీఎస్పీ..
స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలతో కలసి పది రోజుల పాటు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. అంతకుముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఇదీ చదవండి:ప్రభుత్వాలే మారుతున్నాయి.. కార్మికుల బతుకులు కాదు: చాడ