BJP Leader Jithender Reddy Comments: మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేయాలని భాజపా నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ట్విటర్ ద్వారా ఓ వీడియో విడుదల చేశారు. మహబూబ్‌నగర్ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేయాలని కోరుతూ త్వరలో మోదీని కలిసి లేఖ ఇవ్వనున్నట్టు చెప్పారు.
'మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రధాని మోదీ పోటీ చేయాలి' - జితేందర్‌రెడ్డి తాజా వార్తలు
BJP Leader Jithender Reddy Comments: భాజపా నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ట్విటర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేయాలని కోరారు. మోదీ తెలంగాణ నుంచి పార్లమెంట్‌కి పోటీ చేస్తే రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాలు క్లీన్ స్వీప్ చేస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
మోదీ తెలంగాణ నుంచి పార్లమెంట్‌కి పోటీ చేస్తే రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాలు క్లీన్ స్వీప్ చేస్తామని భాజపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్‌ను ఓడించి తీరుతామని కమలనాథులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న భాజపా.. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. కిషన్‌రెడ్డి, బండి సంజయ్, అర్వింద్, సోయం బాపూరావు బీజేపీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి: