ఓ ఇంద్రజాలికుడు కళ్లకు గంతలు కట్టుకుని ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ద్విచక్రవాహనం నడిపాడు. మహబూబ్నగర్ పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా మీదుగా తిరిగి పట్టణ పోలీసు స్టేషన్ వరకూ కళ్లకు గంతలు కట్టుకునే బండి నడిపారు మెజిషియన్ యాసాని వెంకటేశ్వర్లు.
పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని ఈ విన్యాసాన్ని ప్రదర్శించారు. జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు చేసిన ఇంద్రజాల ప్రదర్శనను అభినందించారు. చేతులకు వేసిన బేడీలను విడిపించుకోవడం, మ్యాజిక్ బాక్స్లోంచి జాతీయ జెండాను తీయడం లాంటి ఇంద్రజాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దేశ, విదేశాల్లో సుమారు 6వేలకు పైగా ఇంద్రజాల ప్రదర్శనలిచ్చిన వెంకటేశ్వర్లు.. పోలీసుల అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ప్రదర్శన ఇచ్చారు.
కళ్లకు గంతలతో బైక్ రైడింగ్.. ఎస్పీ అభినందనలు! - magic
ప్రమాదమని తెలిసీ అధిక వేగంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రయాణించే వారున్నారు. అదెంత ప్రమాదమో తెలిపేందుకు కళ్లకు గంతలు కట్టుకుని... తలనిండా ముసుగు వేసుకుని మరీ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ.. ద్విచక్ర వాహనాన్ని నడిపాడో ఇంద్రజాలికుడు.
కళ్లకు గంతలతో బైక్ రైడింగ్.. ఎస్పీ అభినందనలు!
ఇవీ చూడండి: ఐదు పైసలకే.. ఒకటిన్నర ప్లేట్ చికెన్ బిర్యానీ!