తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈటీవీ కథనాలతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు

ఈటీవీలో కథనాల ఆధారంగా... మహబూబ్​నగర్ జిల్లా క్రిస్టియన్ పల్లిలోని సర్వే నంబర్ 523లో భూమిలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చడానికి విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన విజిలెన్స్ బృందం ఈ సర్వే నంబర్​లోని అక్రమ నిర్మాణాలపై ఆరా తీశారు.

By

Published : Feb 7, 2021, 9:36 AM IST

Based on the reports in the ETV media
ఈటీవీ కథనాలతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు

ఈటీవీలో వచ్చిన కథనాల ఆధారంగా... మహబూబ్​నగర్ జిల్లా క్రిస్టియన్ పల్లిలోని సర్వే నంబర్ 523లో భూమిలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చడానికి విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ నుంచి మహబూబ్​నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ముగ్గురు సభ్యుల విజిలెన్స్ బృందం ఈ సర్వే నంబర్ భూములపై ఆరా తీసింది.

ఈ సర్వే నంబర్​లోని భూమి ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉంది? 1954 నుంచి ఇప్పటి వరకూ ఆ భూములను ఎవరెవరికి కేటాయించారో పాత, కొత్త దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి... రికార్డులను సైతం పరిశీలన కోసం తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఈ సర్వే నంబర్​లో దొంగపట్టాలు, అక్రమ నిర్మాణాలపై పలుమార్లు కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో క్షేత్రస్థాయిలోని వాస్తవాలను తెలుసుకునేందుకే ప్రభుత్వం విజిలెన్స్ అధికారులను రంగంలోకి దించినట్లుగా తెలుస్తోంది.

ఇదీ చదవండి:ఇన్​స్టాగ్రామ్​లో సమంత సరికొత్త రికార్డు

ABOUT THE AUTHOR

...view details