తెలంగాణ

telangana

ETV Bharat / state

సామాజిక మాధ్యమాల్లో ఓటేసిన బ్యాలెట్​ పత్రాలు - aballot

ఈ నెల 10 తేదీన జరిగిన రెండో విడత స్థానిక సంస్థల బ్యాలెట్​ పత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర మండలానికి  చెందినవిగా గుర్తించారు. పత్రాలపై ఉన్న క్రమ సంఖ్య ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

సామాజిక మాధ్యమాల్లో ఓటేసిన బ్యాలెట్​ పత్రాలు

By

Published : May 12, 2019, 9:54 AM IST

మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర మండల పరిధిలో ఈనెల 10న జరిగిన రెండో దశ స్థానిక పోరులో ఓటు వేసిన బ్యాలెట్​ పత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి దేవరకద్ర మండలం డోకూర్​ గ్రామ పరిధిలోని ఎన్నికలకు సంబంధించినవిగా అధికారులు తెలిపారు. రెండు బ్యాలెట్​ పత్రాలపై హస్తం గుర్తుపై ఓటేసినట్లు ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఉన్న బ్యాలెట్​ పత్రాలపై తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని, పత్రాలపై ఉన్న క్రమ సంఖ్య ఆధారంగా నిందితున్ని విచారణ చేస్తామని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details