కరోనా ప్రభావంతో ఎవరు తిండి లేకుండా ఉండకూడదన్న ఉద్దేశంతో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో రెండు చోట్ల నిరాశ్రయులు, యాచకులు, నిరుపేదల కోసం ఆశ్రయం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. రాజేంద్రనగర్‌లోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటుచేసిన ఆశ్రయానికి స్వయంగా వెళ్లి పరిశీలించారు. నిరాశ్రయులను, యాచకులను అందులోకి ఆహ్వానించి భోజనం పెట్టించారు.
ఆకలితో ఎవరూ ఉండకూడదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్ - A government that supports the homeless
లాక్‌డౌన్ కారణంగా అంతటా నిర్మానుష్య వాతావరణం నెలకొనటం వల్ల యాచక వృత్తిపైనే ఆధార పడిన వారి బతుకు దుర్భరమైంది. వారి పరిస్థితులను అర్థం చేసుకున్న ప్రభుత్వం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఓ ఆశ్రయాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
ఆకలితో ఎవరూ ఉండకూడదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
కరోనా లాక్‌డౌన్ ముగిసేవరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరో కేంద్రాన్ని జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిత్యావసరాల విక్రయాల కోసం వచ్చిన వాళ్ళు భోజనం కోసం ఇబ్బంది పడకుండా బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్‌ను వినియోగించుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి:కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి..