మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌కు అక్రమంగా తరలిస్తున్న 14 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. రైల్వేప్లాట్ ఫాంపై ఎక్కువ మొత్తంలో బస్తాలు ఉండడాన్ని గమనించిన పోలీసులు తనిఖీ చేశారు. ఈ సోదాల్లో ప్రజా పంపిణీ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. బియ్యం సంచులను తనిఖీ చేయడాన్ని గమనించిన అక్రమార్కులు అక్కడి నుంచి జారుకున్నారు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని పౌర సరఫరాల శాఖ నుంచి కోరినట్లు తెలిపారు. ఇక్కడ చౌకధర దుకాణాల ద్వారా తక్కువ ధరకు బియ్యం కొని... ఇతర రాష్ట్రాల్లోని హోటళ్లకు అమ్ముతున్నట్టు రైల్వే పోలీసులు గుర్తించారు.
14క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత - 14క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
తెలంగాణ నుంచి రేషన్ బియ్యం పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారు. రైళ్లల్లో తరలిస్తున్న 14క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
14క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత