వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల రేపు మహబూబాబాద్ జిల్లాలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా గూడూరు మండలం సోమ్లా తండాలో ఆత్మహత్యకు పాల్పడిన బోడ సునీల్ నాయక్ కుటుంబాన్ని ఆమె పరామర్శించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం గుండెంగి గ్రామంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దీక్ష చేపట్టనున్నట్లు వివరించారు.
YS SHARMILA: రేపు మహబూబాబాద్ జిల్లాలో 'నిరుద్యోగ దీక్ష'.. 18న 'పోడుభూములకై పోరు' - telangana latest news
నిరుద్యోగ నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల రేపు మహబూబాబాద్ జిల్లాలో దీక్ష చేపట్టనున్నారు. గుండెంగి గ్రామంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దీక్ష కొనసాగించనున్నారు.
ఈ సందర్భంగా పోడు భూముల సమస్య పరిష్కారం కోసం.. పోడు రైతులకు భరోసా కల్పించేందుకు షర్మిల ఈ నెల 18న ములుగు జిల్లాలో 'పోడుభూములకై పోరు' కార్యక్రమాన్ని చేపట్టనున్నారని పార్టీ నేతలు తెలిపారు. ఉదయం 11 గంటలకు ములుగు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి.. అనంతరం పస్రా గ్రామంలోని కుమురం భీం విగ్రహానికి నివాళులర్పించి.. లింగాల గ్రామం వరకు భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు వివరించారు. లింగాలలో 'పోడుభూములకై పోరు' కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు.