మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో క్షణికావేశంతో ఓ యువకుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన ఈదురు సైదులు(28) ఈ రోజు ఉదయం ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. తండ్రి సోమయ్యకు స్వల్ప గాయమైంది. అనంతరం చికిత్స కోసం తల్లిదండ్రులు ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లారు.
తల్లిదండ్రులతో గొడవ.. అనంతరం ఆత్మహత్య - మహబూబాబాద్ జిల్లా నేర వార్తలు
తల్లిదండ్రులతో గొడవ పడ్డాననే మనస్థాపంతో దంతాలపల్లి మండలం పెద్దముప్పారానికి చెందిన సైదులు(28) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఉదయం తల్లిదండ్రులతో గొడవ జరగ్గా.. మృతుడి తండ్రికి స్వల్పగాయాలయ్యాయి. చికిత్సకోసం తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో సైదులు ఆత్మహత్య చేసుకున్నాడు.
తల్లిదండ్రులతో గొడవ.. అనంతరం ఆత్మహత్య
ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. తీవ్ర మనస్థాపానికి గురైన సైదులు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:మనమరాలికి కిడ్నీ సమస్య..యాచకుడిగా మారిన తాత