తెలంగాణ

telangana

ETV Bharat / state

సైకత ప్రపంచ పటాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే - teacher neelam srinivas

మహబూబాబాద్​ జిల్లా కురవికి చెందిన అధ్యాపకుడు నీలం శ్రీనివాస్​ సైకత ప్రపంచ పటాన్ని రూపొందించారు. కురవిలోని జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో పటాన్ని ఆవిష్కరించిన డోర్నకల్​ ఎమ్మెల్యే రెడ్యానాయక్​ శ్రీనివాస్​ను అభినందించారు.

సైకత ప్రపంచ పటాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రెడ్యానాయక్​

By

Published : Jun 12, 2019, 4:51 PM IST

సైకత ప్రపంచ పటాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రెడ్యానాయక్​

ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ మహబూబాబాద్​ జిల్లా కురవికి చెందిన అధ్యాపకుడు నీలం శ్రీనివాస్​ రూపొందించిన సైకత ప్రపంచ పటాన్ని డోర్నకల్​ శాసనసభ్యుడు డీఎస్​ రెడ్యానాయక్​ ఆవిష్కరించారు. కురవి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో రూ. 60 వేల వ్యయంతో చిత్రపటాన్ని 15 రోజుల్లోనే తయారుచేశారు. దీని తయారికి ఎనిమిది అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు గల చెక్కలపై 80 కిలోల ఇసుక, 15 కిలోల జిగురు, 115 కిలోల స్టీల్​ను వినియోగించారు. చిత్రపటంపై ఆయా ఖండాలకు చెందిన నోబెల్​ బహుమతి గ్రహీతల చిత్రపటాలను సైతం చెక్కారు. అధ్యాపకుడు నీలం శ్రీనివాస్​ను ఎమ్మెల్యే అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details