భూగర్భ జలాల పెంపునకు అందరూ కృషి చేయాలి - జల సంరక్షణ అవగాహన ర్యాలీ
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో జల సంరక్షణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ కూడలిలో మానవహారం చేపట్టారు. భూగర్భ జలాల పెంపునకు అందరూ తోడ్పాడలాని ఎంపీపీ ఓలాద్రి ఉమ కోరారు.
భూగర్భ జలాల పెంపునకు అందరూ కృషి చేయాలి
జల సంరక్షణను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించాలని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ఎంపీపీ ఓలాద్రి ఉమ అన్నారు. దంతాలపల్లిలో జల శక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా జల సంరక్షణపై ఐకేపీ, వ్యవసాయ శాఖ అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై ఈ ర్యాలీ తీశారు. అంబేడ్కర్ కూడలిలో భారీ మానవహారం నిర్వహించి, నినాదాలు చేశారు. ఇంటింటా ఇంకుడు గుంతలు, వ్యవసాయ భూముల్లో సేద్యపు కుంటలు నిర్మించి భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని కోరారు.