మంత్రి పదవి కోసం ఎర్రబెల్లి దయాకర్‌రావు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారని దుబ్బాక భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఎద్దేవా చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పాలకుర్తి నియోజకవర్గానికి కనీసం డిగ్రీ కళాశాల కూడా తీసుకు రాలేదని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సమావేశంలో మంత్రి ఎర్రబెల్లిపై రఘునందన్ విమర్శలు గుప్పించారు.
మంత్రి పదవి కోసం ఎర్రబెల్లి ఏమైనా చేస్తాడు: రఘునందన్
పాలకుర్తి నియోజకవర్గాన్ని సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలతో పోల్చుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు సూచించారు. పాలకుర్తికి ఏం చేశారని ప్రశ్నించారు. పట్టభద్రుల ఎన్నికల దృష్ట్యా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో భాజపా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
రఘునందన్ రావు
సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలతో పాలకుర్తిని పోల్చుకొని మంత్రి ఆత్మవిమర్శ చేసుకోవాలని రఘునందన్ హితవు పలికారు. తెరాస పాలనలో ఒక్క డీఎస్సీ పరీక్ష కూడా పెట్టని సీఎం కేసీఆర్‌కు ఓటు అడిగే అర్హత లేదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి పెద్దగాని సోమయ్య, భాజపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.