మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రోడ్‌షోలో పాల్గొన్నారు. మంత్రితో పాటు కడియం శ్రీహరి, వరంగల్ లోక్‌సభ తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్ ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఇతర రాష్ట్రాలు వీటి గురించి చర్చిస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పత్తా లేకుండా పోయిందని విమర్శించారు. తెరాస అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
'తెలంగాణ పథకాల గురించి ఇతర రాష్ట్రాలో చర్చిస్తున్నారు' - ఎర్రబెల్లి దయాకర్‌రావు
ఎన్నికల ప్రచారంలో తెరాస నేతలు దూసుకెళ్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రోడ్‌షోలో పాల్గొన్నారు. వరంగల్ లోక్‌సభ తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఎర్రబెల్లి దయాకర్ రావు