తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డిపై దాడి..! - మహబూబాబాద్ జిల్లా తాజా వార్తలు

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో తనపై తెరాస నాయకులు దాడి చేశారని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డి ఆరోపించారు. దాడిలో గాయపడ్డ ప్రేమేందర్‌ రెడ్డిని ఆ పార్టీ కార్యకర్తలు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

trs leaders attack on bjp mlc candidate premender reddy in mahabubabad district
భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డిపై దాడి

By

Published : Mar 14, 2021, 4:51 PM IST

Updated : Mar 14, 2021, 7:16 PM IST

ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డిలో చికిత్స పొందుతున్నారు. ఆయనపై మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో తెరాస నాయకులు దాడి చేశారని పార్టీ నేతలు చెబుతున్నారు.

నెల్లికుదురులో తెరాస నాయకులు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో కార్యకర్తలతో కలిసి ప్రేమేందర్​ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అక్కడ తెరాస, భాజపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలోనే తనపై దాడి చేశారని ప్రేమేందర్​ రెడ్డి తెలిపారు. గులాబీ పార్టీ నాయకుల దాడిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఖండించారు.

భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డిపై దాడి..!

ఇదీ చదవండి:ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్‌.. క్యూలో ఉన్నవారికి ఓటేసే అవకాశం

Last Updated : Mar 14, 2021, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details