మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తెరాస కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పార్టీ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా స్థాపించిన తెరాస.. నేడు రాష్ట్రంలో తిరుగు లేని పార్టీగా విస్తరించిందని శంకర్‌నాయక్ అన్నారు. ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
తెలంగాణలో తిరుగులేని శక్తిగా తెరాస - ఘనంగా తెరాస ఆవిర్భావ వేడుకలు
తెరాస 18వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవిత, ఎమ్మెల్సీ సత్యవతి రాఠోడ్ పాల్గొన్నారు. కేసీఆర్ కృషితో తెరాస తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని వారన్నారు.
ఘనంగా తెరాస ఆవిర్భావ వేడుకలు