మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న బేతోలు గ్రామం ఇటీవలే మహబూబాబాద్ మున్సిపాలిటీలో విలీనమైంది. ఆ గ్రామంలో ఎక్కడ చూసినా కోతుల గుంపులే. ఏ ఒక్కరి నివాసంలోనూ పండ్ల చెట్లకు, చింత చెట్లకు కాయలను ఉండనివ్వవు. పెంకుటిళ్లపై పెంకులను చిందరవందరగా చేస్తాయి. ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా, బయట నుంచి ఇంటికి ఏమైనా సామాన్లు తీసుకుపోవాలన్నా స్థానికులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు.
కోతుల బెడద నియంత్రణకు పులి బొమ్మాస్త్రం మరోవైపు తాజాగా పెద్దపల్లి జిల్లా బసంత్నగర్లోనూ ఇదే పరిస్థితి. ఆ ఊర్లో జేబీ రాజయ్యపై (80) కోతుల గుంపు ఒక్కసారిగా వెంటాడటంతో భయాందోళనకు గురై అక్కడికక్కడే కూలబడిపోయాడు. ఫలితంగా తీవ్ర గాయాలపాలయ్యాడు. ఫలితంగా కోతుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని స్థానికులు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధిక గ్రామాల్లో వానరాలు జనావాసాల మీద పడి విజృంభిస్తున్నాయి.
కోతుల బెడద నియంత్రణకు పులి బొమ్మాస్త్రం వానరాలను ధాటికి గాయాలు..
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో వానర సైన్యం సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నా, గతంలో గ్రామ పంచాయతీ అధికారులు గాని నేడు మున్సిపాలిటీ అధికారులు, ప్రజా ప్రతినిధులు సహా పట్టించుకోలేదు. ఫలితంగా కోతులకు భయపడి చాలా మంది తమ నివాసాల్లో చింత, మామిడి, జామ చెట్లను కొట్టేశారు. అయినా ఆ గ్రామస్థులకు కోతుల బెడద తప్పట్లేదు. కోతుల బాధ నుంచి తప్పించుకునే క్రమంలో గ్రామానికి చెందిన అప్పారావు అనే వ్యక్తి కిందపడ్డాడు. ఫలితంగా తీవ్ర గాయాల పాలయ్యాడు.
కోతుల బెడద నియంత్రణకు పులి బొమ్మాస్త్రం పులి బొమ్మ పంపిన కుమార్తె..
కోతుల భయంతో తన తండ్రి కిందపడిపోయాడని తెలుసుకున్న అప్పారావు కూతురు ఆందోళనకు గురైంది. కోతుల సమస్యకు స్వస్తి పలకాలన్న బలమైన ఆకాంక్ష అప్పారావు కుమార్తెను తీవ్రంగా ఆలోచింపజేసింది. ఈ క్రమంలో రూ.1200 ఖర్చుతో తండ్రి కోసం ఓ పులి బొమ్మను అందించింది. ఆ పులి బొమ్మను ఇంటిపై పెడితే కోతులు రావని నాన్నకు ధైర్యం చెప్పింది.
కోతుల బెడద నియంత్రణకు పులి బొమ్మాస్త్రం కూతురు చెప్పినట్లుగానే..
కుమార్తె చెప్పిన విధంగానే ప్రతి రోజు ఉదయం పులి బొమ్మను ఇంటి ముందున్న రేకులపై పెట్టడం మొదలుపెట్టాడు ఆ తండ్రి. మళ్ళీ చీకటి పడిన తర్వాత ఆ బొమ్మను అక్కడి నుంచి తీసి ఇంట్లో పెడతాడు. ఆ బొమ్మను చూసిన తర్వాత చాలా రోజుల వరకు కోతులు ఆ ఇంటి పరిసర ప్రాంతాలకు పోలేదు. అంతేకాక అప్పారావు వ్యవసాయ పనుల కోసం చేను వద్దకు వెళ్లేటప్పుడు ఆ బొమ్మను తీసుకెళ్తాడు.
కోతుల బెడద నియంత్రణకు పులి బొమ్మాస్త్రం అప్పారావు ఆనందం..
గతంలో ఇంటి ఆవరణలో ఉన్న జామ, మామిడి, సీతాఫలం, చింత కాయలు ఒక్కటి కూడా దక్కలేదని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు. కోతులు మొత్తం తెంపి పడేసేవన్నారు. ఈ పులి బొమ్మతో కోతుల బాధ తప్పిందని అప్పారావు హర్షం వ్యక్తం చేశాడు. పులి బొమ్మతో అప్పారావు ఇంటి పక్కన ఉన్న నివాసాల వైపు కూడా కోతులు రావడం లేదని అప్పారావు పక్కింట్లో నివాసముండే మస్తాన్ అలీ స్పష్టం చేశారు. తాము కూడా అలాంటి బొమ్మను తెచ్చుకుని కోతుల తాకిడి నుంచి ఉపశమనం పొందుతామని వివరించారు.
కోతుల బెడద నియంత్రణకు పులి బొమ్మాస్త్రం ఇవీ చూడండి : రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు అక్కడక్కడా వర్షాలు