పిడుగుపడి మిరప తోటలో పనిచేస్తున్న ఓ వ్యవసాయ కూలీ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మోదుగుల గూడెం గ్రామ శివారులో చోటు చేసుకుంది. మిరపతోటలో పనిచేస్తున్న 10 మంది మహిళలు.. పెద్ద శబ్దం వినిపించగానే భయంతో తలో వైపు పరిగెత్తారు. అదే సమయంలో నర్సమ్మ అనే మహిళపై పిడుగు పడి అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. అప్పటివరకు తమతో పని చేసిన మహిళ విగతజీవిగా మారివటం చూసి.. తోటి కూలీలంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. నర్సమ్మ.. భర్త 10 సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వీరి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ప్రభుత్వం మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇద్దరు పిల్లలను అనాథలుగా మార్చిన 'పిడుగు' - పిడుగు
వ్యవసాయ భూమిలో పిడుగు పడి.. ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోదుగుల గూడెం గ్రామశివారులో చోటుచేసుకుంది.
అనాథలుగా మార్చిన 'పిడుగు'