మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వద్ద పోలీసులు 40 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడ్డ గంజాయి విలువ నాలుగు లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా ఓ కారులో అక్రమంగా తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. ముగ్గురిని అదుపులోని తీసుకున్నట్లు ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి వెల్లడించారు.
ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్ద గంజాయి స్వాధీనం-ముగ్గురు అరెస్ట్ - గంజాయి తరలింపులో ముగ్గురిని అరెస్ట్
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 40 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 4లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఒడిశా గంజాం జిల్లాకు చెందిన శివశంకర్ సాహూ, మల్కనగిరి జిల్లాకు చెందిన మధుకమి దూల, సర్ కార్ స్వప్నల ముఠా ఒడిశాలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రైళ్లు నడవకపోవడంతో సొంత వాహనాలు, కిరాయి వాహనాల్లో తరలిస్తున్నారని వెల్లడించారు. జిల్లాలో గంజాయి చాలాసార్లు పట్టుబడటంతో..అన్నిచోట్లా నిఘా ఏర్పాటు చేశామని..ఏ మార్గంలో అక్రమ రవాణా చేసినా పోలీసులకు చిక్కక తప్పదని ఎస్పీ హెచ్చరించారు.గంజాయిని పట్టుకునేందుకు కృషి చేసిన సిబ్బందికి ఎస్పీ రివార్డులను అందించి అభినందించారు.
ఇవీ చదవండి: 'ప్రభుత్వం నోటిఫై చేసిన కులాలకే రిజర్వేషన్'