మహబూబాబాద్ జిల్లాలో పెండింగ్ వేతనాలు చెల్లించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం ముందు ఆశా కార్యకర్తలు ధర్నా చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ నినాదాలు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు పని చేస్తున్నామని, అదనపు పనిని కూడా అప్పగిస్తున్నారని జిల్లా అధ్యక్షురాలు శారద ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో పని ఎక్కువగా చేశామన్నారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
'బకాయిలు వెంటనే చెల్లించి..సమస్యలు పరిష్కరించాలి'
చాలీ చాలని జీతాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామని, బకాయిలను వెంటనే చెల్లించాలని మహబూబాబాద్‌లో ఆశా కార్యకర్తల జిల్లా అధ్యక్షురాలు శారద డిమాండ్ చేశారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
వెంటనే మా సమస్యలు పరిష్కరించాలి : శారద