మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చక్రుతండాకు చెందిన అజ్మీరా రూప్లా.. అదే మండల కేంద్రానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిట్టచివరి మారుమూల గిరిజన గ్రామం దొరవారితిమ్మాపురం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
వాగు దాటాలి.. విద్యార్థులను చేరాలి.. - చక్రుతండాకు చెందిన అజ్మీరా రూప్లా తాజా వార్తలు
వాయుగుండం ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీనితో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులను చేరేందుకు నానా అవస్థలు పడ్డారు.
వాగు దాటాలి.. విద్యార్థులను చేరాలి..
సోమవారం ద్విచక్రవాహనంపై బురద దారులపై శ్రమకోర్చి ఊరు వరకు చేరినా వాగు ప్రవాహంతో అక్కడి నుంచి ముందుకెళ్లలేకపోయారు. చివరికి ప్రమాదకరంగా వాగు దాటి పాఠశాలకు చేరుకున్నారు. తిరుగుప్రయాణంలోనూ ఇలాగే ఇల్లు చేరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: ధరణి యాప్ వల్ల నష్టాలు లేవు... పుకార్లు నమ్మొద్దు: సీఎస్