Konark Express : ముంబయి నుంచి భువనేశ్వర్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ బోగీలో పొగలు రావడంతో రైలును మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్ రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే రైల్వేస్టేషన్‌కు చేరుకొని మరమ్మతు చర్యలు చేపట్టారు. పొగలు వ్యాపించిన బోగీని వేరు చేసి ప్రయాణికులను మరో బోగీలోకి తరలించారు.
Konark Express : కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు - Konark Express news
Konark Express: ముంబయి నుంచి భువనేశ్వర్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు వ్యాపించాయి. రైలును డోర్నకల్ జంక్షన్ రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. ఏసీ బోగీలో పొగలు రావడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. దీనిపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.
కోణార్క్ ఎక్స్‌ప్రెస్
ఈ ఘటన వల్ల ప్రయాణికులెవరూ ఇబ్బంది పడలేదని అందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు వెల్లడించారు. ఏసీ బోగీలో పొగలు రావడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. సాంకేతిక కారణాల వల్ల జరిగిందా లేదా ఇతర కారణాలా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.