తెలంగాణ

telangana

ETV Bharat / state

లైవ్ వీడియో: వార్డు సభ్యుడిపై.. అనుచరులతో సర్పంచ్ దాడి - మహబూబాబాద్​ జిల్లా నేర వార్తలు

వార్డు సభ్యుడిపై సర్పంచ్​ దాడికి దిగాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం రేకులతండా సర్పంచ్​ అనుచరులతో కలిసి... తనపై దాడి చేశాడని మూడో వార్డు సభ్యుడు బానోతు రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Sarpanch attack on ward member
సమస్యలను పరిష్కరించమన్నందుకు వార్డు సభ్యుడిపై సర్పంచ్​ దాడి

By

Published : Jun 18, 2020, 12:01 PM IST

సమస్యలను పరిష్కరించమన్నందుకు వార్డు సభ్యుడిపై సర్పంచ్​ దాడి

గ్రామ సర్పంచ్​ తన అనుచరులతో కలిసి వార్డు సభ్యుడిపై దాడి చేసిన ఘటన మహబూబాబాద్​ జిల్లా కురవి మండలం రేకులతండాలో జరిగింది. గ్రామ పంచాయతీలో పేరుకుపోయిన సమస్యను పరిష్కరించాలని అడినందుకు తనపై దాడి చేశారని మూడో వార్డు సభ్యుడు బానోతు రాజు ఆరోపించారు. వార్డు సభ్యుడి వెంట పడి దాడి చేసిన వీడియోలు సామజిక మాధ్యమాల్లో హల్​చల్​‌ చేస్తున్నాయి.

కరోనా నేపథ్యంలో గ్రామంలో శానిటేషన్‌ పనులు చేపట్టాలని, మాస్కులు పంపిణీ చేయాలని అడిగినందుకు... సర్పంచ్​ తన అనుచరులతో కలిసి ద్విచక్రవాహంపై వెళ్తుండగా దాడి చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: 50 ఏళ్ల టీచరమ్మ.. బౌలింగ్​ అదిరిందమ్మా!

ABOUT THE AUTHOR

...view details