తెలంగాణ

telangana

ETV Bharat / state

కుళ్లిన గుడ్లు.. గుడ్లు తేలేసిన అధికారులు - rotten eggs distrubted at anganwadi of adarsha tanda at mahabubabad

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్​లోని దుబ్బ తండా ఆదర్శ అంగన్వాడీ కేంద్రానికి గత నెల 21న తీసుకొచ్చిన కోడిగుడ్లను.. అవి పాడై కుళ్లిపోయాక లబ్ధిదారులకు సరఫరా చేశారు. అంగన్వాడీ టీచర్, కార్యకర్త నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని.. వారిపై చర్యలు తీసుకుంటామని సీడీపీవో హైమావతి పేర్కొన్నారు.

rotten eggs provided at adarsha anganwadi in torrur
కుళ్లిన గుడ్లు.. గుడ్లు తేలేసిన అధికారులు

By

Published : Aug 13, 2020, 4:23 PM IST

Updated : Aug 13, 2020, 4:48 PM IST

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్​లోని దుబ్బ తండ ఆదర్శ అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్లను సరఫరా చేస్తుండటంతో లబ్ధిదారులు అవాక్కయ్యారు. సమాచారం తెలుసుకున్న కొందరు స్థానికులు అంగన్వాడీ కేంద్రంలో గుడ్లను పరిశీలించి కుళ్లిపోయిన గుడ్లను ఇవ్వడమేంటని సంబంధిత అధికారులపై మండిపడ్డారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారం ఇవ్వకుండా వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయమై సీడీపీవో హైమావతిని వివరణ కోరగా ఆదర్శ అంగన్వాడీ కేంద్రానికి గత నెల 21న కోడిగుడ్లు వచ్చాయని.. అప్పటినుంచి వాటిని లబ్ధిదారులకు ఇవ్వకపోవడం వల్లే కుళ్లిపోయాయని ఆమె తెలిపారు. అంగన్వాడీ టీచర్, కార్యకర్త నిర్లక్ష్యం వహించడం వల్లే ఇలా జరిగిందని.. వారికి మెమో జారీ చేసి శాఖపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వమని స్పష్టం చేశారు.

Last Updated : Aug 13, 2020, 4:48 PM IST

ABOUT THE AUTHOR

...view details