మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి రెండు ప్రాంతాల్లో కేటుగాళ్లు దొంగతనానికి పాల్పడ్డారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వైన్స్‌లోకి చొరబడి రూ. లక్ష నగదుతో పాటు విలువైన మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు.
వైన్‌షాప్‌లో దొంగలు..మద్యం, మనీతో పరార్.. - వైన్‌షాప్‌లో దొంగలు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు బెంబేలెత్తిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న మద్యం దుకాణం, తాళం వేసున్న ఇంట్లోకి చొరబడి లూటీ చేశారు. .
వైన్‌షాప్‌లో దొంగలు పడ్డారు..
చెరువు ప్రాంతంలోని తాళమేసి ఉన్న ఇంట్లో లూటీ చేశారు. బీరువాను పగులగొట్టి నాలుగు తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు చోట్ల కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీలు, క్లూస్ టీమ్ సహకారంతో దర్యాప్తు చేస్తున్నారు.