మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి- సూర్యాపేట రహదారిపై ఉన్న పెట్రోల్ బంక్‌కి తెల్లవారుజామున ఇద్దరు దొంగలు వెళ్లారు. బంక్‌లోని సిబ్బంది నిద్రలో ఉండగా... ఒకరు బయట కాపలాగా ఉండి.. మరొక దొంగ గదిలోకి ప్రవేశించాడు.
పెట్రోల్ బంక్‌లో చోరీ... సీసీ కెమెరాల్లో దృశ్యాలు - పెట్రోల్ బంక్‌లో చోరీ
పెట్రోల్ బంక్‌లో ప్రవేశించిన ఇద్దరు దొంగలు చాకచక్యంగా ఫోన్, బైక్‌ను దొంగలించిన ఘటన దంతాలపల్లిలలో చోటు చేసుకుంది. ఈ తతంగమంతా సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది.
పెట్రోల్ బంక్‌లో చోరీ... సీసీ కెమెరాల్లో దృశ్యాలు
అక్కడ టేబుల్‌పై ఉన్న ఫోన్‌తో పాటు బంక్‌లో ఉన్న బైక్‌ను దొంగలించారు. ఉదయం లేచిన సిబ్బంది ఫోన్, బైక్ కనిపించకపోవడంతో అనుమానం వచ్చి సీసీ కెమెరాల్లోని ఫుటేజిని పరిశీలించారు. చోరి జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఇవీ చూడండి:శిశువును పీక్కుతిన్న శునకాలు