తెలంగాణ

telangana

ETV Bharat / state

అంగన్వాడీ కేంద్రాలకు దొడ్డు బియ్యమే దిక్కు - anganwadi

మహబూబ్​బాద్​ జిల్లా తొర్రూరు మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో  దొడ్డన్నం గొంతు దిగట్లేదని గర్భిణులు, చిన్నారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై స్పందించి సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

అంగన్వాడీ కేంద్రాలకు దొడ్డు బియ్యమే దిక్కు

By

Published : Jul 2, 2019, 3:06 PM IST

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో అంగన్వాడీ కేంద్రాల్లో దొడ్డన్నం తింటూ గర్భిణులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు..పౌష్టికాహార పంపిణీలోని లోపాలను సవరించే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2015 జనవరి1 తేదిన అంగన్వాడీ కేంద్రాల్లో ఒక పూట సంపూర్ణ భోజనం పెట్టే ఉద్దేశంతో పథకాన్ని ప్రవేశపెట్టింది. సన్న బియ్యంతో భోజనం అందివ్వాల్సి ఉండగా దానికి బదులు దొడ్డు బియ్యంతో భోజనం పెడుతున్నారు. దొడ్డన్నం తినలేక గర్భిణులు, బాలింతలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. సగం మంది కూడా కేంద్రాలకు వచ్చి భోజనం చేయడం లేదు. వచ్చిన వాళ్లు కూడా దొడ్డన్నం తినలేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యపై స్పందించి సన్నబియ్యం పంపిణీ చేయాలని చిన్నారులు కోరుతున్నారు.

అంగన్వాడీ కేంద్రాలకు దొడ్డు బియ్యమే దిక్కు

ABOUT THE AUTHOR

...view details