మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో మహిళలు 'రేపల్లెవాడ నోము' నోముకున్నారు. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని... అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలని భక్తిశ్రద్ధలతో నోముకున్నట్లు తెలిపారు.
ఆయురారోగ్యాల కోసం 'రేపల్లెవాడ నోము'
సంక్రాంతి పండుగ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో మహిళలు 'రేపల్లె వాడ నోము' నోముకున్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో విరాజిల్లాలని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
ఆర్యవైశ్య కల్యాణ మండపంలో మహిళల రేపల్లెవాడ నోము
సంక్రాంతి పండుగకు పంటలన్నీ చేతికి రావడం వల్ల సుఖ సంతోషాలతో... ఆనందోత్సాహాల మధ్య మూడు రోజుల పాటు వేడుకలు చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి.. మూడో రోజు కనుమ పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా మహిళలు పలు రకాల నోములు నోముకుంటారు.
ఇవీ చూడండి : ముషీరాబాద్‌లో వైభవంగా మల్లన్న జాతర మహోత్సవం