తెలంగాణ

telangana

ETV Bharat / state

'పట్టాదారు పాసు పుస్తకాలిస్తేనే... ఓట్లేస్తాం' - RAITHU BANDHU

400 రైతు కుటుంబాలున్న ఆ గ్రామంలో ఏ ఒక్క రైతుకు పాసు పుస్తకం లేదు. రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలవుతుంటే ఆ గ్రామంలో మాత్రం ఏ చప్పుడూ లేదు.

'పట్టాదారు పాసు పుస్తకాలిస్తేనే... ఓట్లేస్తాం'

By

Published : Mar 30, 2019, 4:46 PM IST

'పట్టాదారు పాసు పుస్తకాలిస్తేనే... ఓట్లేస్తాం'
పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేయాలంటూ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు రైతులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. పార్లమెంట్ ఎన్నికల లోపు పాసు పుస్తకాలు ఇవ్వాలని లేని పక్షంలో ఎన్నికలను బహిష్కరించాలని రైతులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. చేతిలో ఫ్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మాధవాపురం గ్రామంలో జరిగింది.

2,400 మంది ఓటర్లున్న ఆ గ్రామంలో 400 రైతు కుటుంబాలున్నాయి. కానీ అందులో ఒక్కరికి కూడా పాసు పుస్తకం జారీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆ ఊళ్లో రెండుసార్లు సర్వే నిర్వహించినా ఫలితం కనిపించలేదని వాపోయారు. రాష్ట్రమంతటా పాసు పుస్తకాలు జారీ అయి, రెండు విడతల రైతుబంధు చెక్కులను అందుకుంటే తమ గ్రామంలో ఏ ఒక్క రైతుకు కూడా చెక్కు రాలేదని తెలిపారు. ఇటీవల మృతి చెందిన ఇద్దరు రైతన్నలకు బీమా వర్తించలేదని చెప్పారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. లోక్​సభ ఎన్నికలకు ముందే తమకు పాసు పుస్తకాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:దేశంలో బడితే ఉన్నోడిదే బర్రె : కేటీఆర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details