మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వేజంక్షన్‌లో విషాదం చోటుచేసుకుంది. తాను సూచనలిచ్చే రైలే తనను చంపేస్తుందని ఆ ర్వైల్వే ఉద్యోగి ఊహించలేకపోయాడు. నరేందర్(30) డోర్నకల్ రైల్వేస్టేషన్లో పాయింట్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు.
రైలును నియంత్రించే ఉద్యోగే రైలు ఢీకొని మృతి
పాము పట్టే వాడు పాము కాటుకే చనిపోతాడంటుంటారు. అవుననే అనిపిస్తోంది ఈ విషాదకర ఘటన చూస్తూంటే. ఎన్నో ర్వైళ్లను నియంత్రించే ఆ పాయింట్‌మెన్... తన మృత్యువును మోసుకొని దూసుకొస్తున్న ఆ ధూమశకటాన్ని మాత్రం ఆపలేకపోయాడు. అదే ర్వైలు ఢీకొని మరణించాడు.
RAILWAY EMPLOYEE DIED IN RAIL ACCIDENT AT DORNAKAL JUNCTION
రోజూలాగే రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న నరేందర్‌ను సికింద్రాబాద్ నుంచి కాకినాడకు వెళ్లే గౌతమి ఎక్స్‌ప్రెస్ ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనలో నరేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. నరేందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాద వార్త విన్న కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోధించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.