మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో 55 మంది పేదలకు బియ్యంతో పాటు సరకులు అందించారు.
పేదలకు నిత్యావసర సరకుల పంపిణీ - నిత్యావసర సరకుల పంపిణీ వార్తలు
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదవారిని ఆదుకోవటానికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు ముందుకొస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
పేదలకు నిత్యావసర సరకుల పంపిణీ
లాక్డౌన్ సందర్భంగా పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ చేసినట్లు మండల అధ్యక్షుడు అక్కి రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే భౌతిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుస్మిత, పీఆర్టీయూ సంఘం నాయకులు పాల్గొన్నారు.