తెలంగాణ

telangana

ETV Bharat / state

అసభ్యపదజాలంతో పోస్ట్​.. వ్యక్తి అరెస్ట్​ - ఆలింగనం ఫొటో

మహబూబాబాద్​ ఎంపీ మాలోతు కవిత, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ ఆలింగనం ఫొటోపై ఫేస్​బుక్​లో అసభ్యకరంగా కామెంట్​ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మరిపెడ మండలం గాలివారిగూడెంకు చెందిన మహిళా సంఘం అధ్యక్షురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

అసభ్యపదజాలంతో పోస్ట్​.. వ్యక్తి అరెస్ట్​

By

Published : Aug 10, 2019, 11:57 PM IST

అసభ్యపదజాలంతో పోస్ట్​.. వ్యక్తి అరెస్ట్​
మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియపై సామాజిక మాధ్యమంలో అసభ్యకరమైన పోస్టు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియ ఆలింగనం చేసుకుని ఉన్న ఒక ఫొటోను వాంకుడోతు తరుణ్‌ అనే వ్యక్తి.. ఆగస్టు 4న ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. అదే రోజు మధ్యాహ్నం నుంచి ఆగస్టు 5 వరకు మరిపెడ మండలం తానంచెర్ల శివారు, డక్నాతండాకు చెందిన బానోతు రాంబాబు వారిని ఉద్దేశించి అసభ్యకరంగా కామెంట్​ చేశాడు. దీనిపై గాలివారిగూడెంకు చెందిన మహిళా సంఘం అధ్యక్షురాలు నారెడ్డి కవిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధ్యుడైన రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం ఇంటి వద్ద ఉన్న రాంబాబును అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details