మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాలకనుగుణంగా జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లపై కొరడా ఝుళిపించారు. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు రంగంలోకి దిగి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇసుక రవాణాకు అనుమతి పత్రాలు, వాహనాలకు సరైన ధ్రువపత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 50 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేశారు. అనంతరం వాటిని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. జిల్లాలో అక్రమ రవాణా చేపడుతున్న వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
అక్రమ రవాణాపై కదంతొక్కిన పోలీసు యంత్రాంగం - ఇసుక రవాణా
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలన సీజ్ చేయడమే కాకుండా... అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
అక్రమ రవాణాపై కదంతొక్కిన పోలీసు యంత్రాంగం