మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్లలో డీఎస్పీ ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటిని తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లలో నిల్వ చేసిన 25వేల రూపాయల విలువ గల మద్యం, సరైన పత్రాలు లేని 23 ద్విచక్రవాహనాలు, 3 ఆటోలు, 2 ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని డీఎస్పీ మదన్‌లాల్ కోరారు. అక్రమ దందాలకు పాల్పడితే... వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తానంచర్లలో పోలీసుల నిర్బంధ తనిఖీలు - cordon search
మహబూబాబాద్ జిల్లా తానంచర్ల గ్రామంలో పోలీసుల నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను, మద్యం స్వాధీనం చేసుకున్నారు.
తానంచర్లలో పోలీసుల నిర్బంధ తనిఖీలు