మహబూబాబాద్ జిల్లాలో ఈ వానాకాలంలో 1,62,518 హెక్టార్లలో పంటల సాగుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, అపరాల సాగుతో పాటు మిర్చి, పసుపు పంటలను సాగు చేస్తారని, అందుకు 19,776.58 క్వింటాళ్ల రాయితీ విత్తనాలు, ఎరువుల పంపిణీ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ వానాకాలంలో 42,497 హెక్టార్లలో పత్తి సాగవుతుందని అంచనా.
మానుకోటలో సాగు ప్రణాళిక ఖరారు - planning for Kharif crop in mahabubabad
మహబూబాబాద్ జిల్లాలో వానాకాలం పంటల సాగుకు కార్యాచరణ ప్రణాళికను వ్యవసాయశాఖ అధికారులు రూపొందించారు. ఈ వానాకాలంలో 1,62,518 హెక్టార్లలో పంటల సాగుకు ప్రణాళికను సిద్ధం చేశారు.
ఇందుకు 2,48,300 పత్తి విత్తన సంచులు, 1,43,043 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని జిల్లా వ్యవసాయాధికారి ఛత్రునాయక్ తెలిపారు. వరిలో బీపీటీ-5204, కేఎన్‌ఎం-118, ఎంటీయూ-1001, ఎంటీయూ-1010, ఆర్‌ఎన్‌ఆర్-15048 రకాలకు సంబంధించి విత్తనాలు 28502.75 క్వింటాళ్లు, ప్రైవేట్ మొక్కజొన్న హైబ్రీడ్ విత్తనాలు 2785 క్వింటాళ్లు, ఎంజీజీ-295, డబ్ల్యూజీజీ-42 పెసర రకాలు 1653 క్వింటాళ్లు, మినుములు-పీయూ31 రకం 484, కందులు 398, వేరుశనగ 515, నువ్వులు 5, సోయాబీన్ 20 క్వింటాళ్లు ఇక పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు పిల్లిపిసర 34, జనుము 1710, జీలుగ 6123 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని ప్రతిపాదనలు చేశారు.