మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండాలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ తండావాసులు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై బిందెలు పెట్టి నిరసన తెలిపారు. వార్డు సభ్యులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తండాలో రెండు ట్యాంకులు ఉన్నా నీటి సమస్య తప్పడం లేదని వాపోయారు.
తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన
తాగునీటి సమస్యను పరిష్కరించాలని తూర్పు తండావాసులు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. రెండు ట్యాంకులు ఉన్నా వారానికి ఒకసారి మాత్రమే నీరు వస్తోందని వాపోయారు. గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన
ఒక ట్యాంకు నిరుపయోగంగా ఉండగా మరో ట్యాంక్‌కు సరిపడా నీరు రావడం లేదన్నారు. వారానికి ఒకసారి మాత్రమే నీరొస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండి:మళ్లీ మొదటికి: గీత మా కూతురే... డీఎన్ఏకి సిద్ధం!