School gate locked: ప్రధానోపాధ్యాయురాలు ఆలస్యంగా రావడం విద్యార్థుల తల్లిదండ్రులకు ఆగ్రహం తెప్పించింది. సమయ పాలన పాటించడం లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది.
School gate locked: ప్రధానోపాధ్యాయురాలు నిర్వాకం.. పాఠశాల గేటుకు తాళం - పాఠశాల గేటుకు తాళం
School gate locked: సమయపాలన పాటించడం లేదంటూ ప్రధానోపాధ్యాయురాలిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది.
headmaster late in mahabubabad: జిల్లా కేంద్రంలోని వెంకటెశ్వరబోడ్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న పొన్నమ్మ ప్రతి రోజు పాఠశాలకు ఆలస్యంగా వస్తోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సరైన సమయపాలన పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను సరిగా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
govt school headmaster: పాఠశాలకు సంబంధించిన బడ్జెట్ విషయంలో ఛైర్మన్‌తో సంబంధం లేకుండా నిధులు డ్రా చేసుకుంటూ తన ఇష్టానుసారంగా వాడుకుంటున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎన్ని సార్లు హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో పాఠశాలకు తాళం వేశామని తెలిపారు. పాఠశాలకు తాళం వేయడంతో విద్యార్థులంతా ఆరుబయటే ఉండిపోయారు. మిగతా ఉపాధ్యాయులు మరోసారి ఈ విధంగా జరగకుండా చూస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇవ్వడంతో వారు గేటు తాళం తీశారు. దీంతో వివాదం సద్దుమణిగింది. పాఠశాలలో 120 మంది విద్యార్థులుకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు.