మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ శివారులో ఓహెచ్ఈ విద్యుత్ తీగలు తెగిపోవటంతో విజయవాడ-కాజీపేట మార్గంలో పలు రైళ్లు గంటన్నర సేపు నిలిచిపోయాయి. కేసముద్రంలో గరీబ్‌రథ్ ,మహబూబాబాద్‌లో నాందేడ్, హుంసఫర్ ఎక్స్ ప్రెస్‌లు, వరంగల్‌లో పలు రైళ్ల ను నిలిపివేశారు. నెక్కొండ నుంచి ప్రత్యేక సిబ్బంది టవర్ కార్లో చేరుకొని మరమ్మతులు చేసి, రైళ్లను నడిపించారు.
సాంకేతిక లోపంతో మరో రైలు.. డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో మరో ప్యాసింజర్ సింగరేణి సుమారు గంటపాటు నిలిచిపోయింది. భద్రాచలం నుంచి బల్లార్షా వెళ్లే సింగరేణి రైలులో సాంకేతిక లోపం కారణంగా గంటపాటు అక్కడే ఆగిపోయింది. అధికారులు మరమ్మతులు చేపట్టిన అనంతరం అక్కడ నుంచి రైలు బయలుదేరి వెళ్లింది.
ఇలా రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.