మంత్రి ఈటల రాజేందర్‌పై వస్తున్న ఆరోపణలకు నిరసనగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజ్‌లు నిరసన తెలిపారు. గులాబీ పూలు చేతపట్టుకుని.. నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్థూపం ముందు నిరసన తెలిపారు.
'ఈటల ఎదుగుదలను చూసి ఓర్వలేకనే కక్షపూరిత చర్యలు' - ముదరిజ్ ఆందోళన
మంత్రి ఈటల రాజేందర్‌కు మద్ధతుగా మహబూబాబాద్‌లో ముదిరాజ్‌లు ఆందోళన చేశారు. ఆయన రాజకీయ ఎదుగుదల చూడలేకనే కక్షపూరిత చర్యలు చేపట్టారని వ్యాఖ్యానించారు. జై ఈటల, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.
జై ఈటల, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సబ్బండ ప్రజల అభిమాని ఈటల రాజేందర్‌పై ఎలాంటి ఆధారాలు లేకున్నా, రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక కక్షపూరితంగా చర్యలు చేపట్టారని తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకుడు భాస్కర్ వ్యాఖ్యానించారు. మంత్రివర్గంలో అనేక మందిపై ఆరోపణలు వచ్చినా.. కేవలం బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడం తగదన్నారు. ముదిరాజ్ కులస్థులు మొదటినుంచి తెరాసకు అనుకూలంగా పనిచేస్తున్నారని... వెంటనే ఈటలపై తీసుకున్న చర్యలను వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు.