అధికారులు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడం లేదని తల్లీకొడుకులు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆత్మహత్యకు యత్నించాడు. మహబూబాబాద్ జిల్లా కురవిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడే ఉన్న రైతులు, రెవెన్యూ సిబ్బంది అడ్డుకొని మందు డబ్బా లాక్కున్నారు. విచారణ అనంతరం పాసు పుస్తకం ఇస్తామని చెప్పినా... కావాలనే ఇలా వారు ఇలా చేశారని తహసీల్దార్ విజయ్ కుమార్ పేర్కొన్నారు.
పట్టా పాసుపుస్తకం కోసం తల్లీకొడుకుల ఆత్మహత్యాయత్నం - తల్లీకొడుకుల ఆత్మహత్యాయత్నం
మహబూబాబాద్ జిల్లా కురవి తహసీల్దార్ కార్యాలయం ముందు ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అక్కడే ఉన్న రైతులు, సిబ్బంది గమనించి అడ్డుకున్నారు.
పట్టా పాసుపుస్తకం కోసం తల్లీకొడుకుల ఆత్మహత్యాయత్నం
మండలంలోని లింగ్యాతండాకు చెందిన ఇస్లావత్ క్రాంతి, ఆమె కుమారుడికి రెండున్నర ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. పట్టాదారు పాసుపుస్తకం కోసం గతంలో సాదాబైనామా కింద దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన 224 సర్వే నెంబర్లో మరొకరి పేరుపై నమోదైనట్టు బాధితులు ఆరోపించారు. కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని ఆత్మహత్యకు యత్నించినట్టు తల్లీకొడుకు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:పదికి సన్నద్ధం... కరోనా నేపథ్యంలో అప్రమత్తం