మహబూబాబాద్ జిల్లాలో ఉదయం మందకోడిగా ప్రారంభమైన ఎమ్మెల్సీ పోలింగ్... 9 గంటల తర్వాత వేగం పుంజుకుంది. పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. మహబూబాబాద్ పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులు, ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులు - తెలంగాణ లేటెస్ట్ న్యూస్
మహబూబాబాద్‌లో తొలుత మందకోడిగా ప్రారంభమైన పోలింగ్... తర్వాత వేగం పుంజుకుంది. పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులు ఓటేశారు.
వేగం పుంజుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
పోలింగ్ కేంద్రాల ముందు హెల్ప్ డెస్క్, ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపారు.
ఇదీ చదవండి:థౌజండ్ లైట్స్ నుంచి ఎన్నికల బరిలో ఖుష్బూ!