రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని డోర్నకల్ శాసన సభ్యుడు రెడ్యానాయక్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట, జయపురం గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను.. వస్రాంతండాలోని వైకుంఠధామాన్ని ఆయన ప్రారంభించారు.
ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది: రెడ్యానాయక్ - తెలంగాణ వార్తుల
ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోన్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే రెడ్యానాయక్ స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో పర్యటించి రైతు వేదికలు ప్రారంభించారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోన్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. రైతులకు అండగా నిలిచేందుకు డోర్నకల్ నియోజకవర్గంలో రూ.6 కోట్లతో 32 రైతు వేదికలను నిర్మించినట్లు తెలిపారు. నిర్మాణం పూర్తయిన వాటిని ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేకు మండల తెరాస నాయకులు గజమాల వేసి ఘనంగా సన్మానించారు.
ఇదీ చూడండి:విషాదం: అమ్మనాన్న లేరని యువకుడి ఆత్మహత్య