తనకు అప్పగించిన బాధ్యతలను నీతి నిజాయితీలతో నిర్వర్తిస్తానని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగులో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోన్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఆమె తెలిపారు. రాష్ట్రంలోని సుమారు కోటి మంది మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు ఆమె వివరించారు.
బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి సత్యవతి రాఠోడ్
తనకు అప్పగించిన బాధ్యతలను నీతి నిజాయితీలతో నిర్వర్తిస్తానని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు.
బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి సత్యవతి రాఠోడ్