తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్లు విశాలంగా నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేయండి

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రద్దీని నివారించేందుకు రోడ్లు విశాలంగా నిర్మించేందుకు ప్రణాళికలు తయారు చేయాలని మంత్రి సత్యవతి రాఠోడ్ అధికారులకు సూచించారు. ఈ అంశంపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్​ కార్యాలయంలో సమావేశం జరిపారు.

minister satyavathi said Plan to build roads spacious in mahabubabad area
రోడ్లు విశాలంగా నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేయండి

By

Published : Jun 13, 2020, 6:06 AM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రద్దీని నివారించేందుకు రోడ్లు విశాలంగా, అందంగా నిర్మించేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించాలని మంత్రి సత్యవతి రాఠోడ్ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పట్టణాభివృద్ధి సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణాభివృద్ధి ప్రణాళికను కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

కొత్తగా మహబూబాబాద్ జిల్లా ఏర్పడిన నాటి నుంచి అన్ని రంగాల్లో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని మంత్రి అన్నారు. పార్కులు, రింగ్ రోడ్లు, విద్యుత్ దీపాలు, డివైడర్లు, ఫుట్ పాత్​లు మొదలైనవి నిర్మించాలన్నారు. రానున్న కాలంలో మహబూబాబాద్ జిల్లా రాష్ట్రంలోనే రోల్ మోడల్​గా నిలపాలని అధికారులను కోరారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఇంద్రసేనారెడ్డి, తదితరులు హాజరయ్యారు.

ఇదీ చూడండి :'గాంధీలో జరుగుతున్న చికిత్సపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి'

ABOUT THE AUTHOR

...view details