పల్లెలను అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాఠోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల గ్రామంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
'పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి' - tribal welfare minister satyavathi rathode
పట్టణాలకు తీసిపోని విధంగా పల్లెలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు.
'పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి'
సీఎం కేసీఆర్ పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2ల నుంచి మహబూబాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామానికి గోదావరి జలాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు.
మహబూబాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే గాక ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని మంత్రి తెలిపారు. అనంతరం ఉన్నత పాఠశాలలో జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొన్నారు.
- ఇదీ చూడండి: రాజస్థాన్‌లో పండగ కోసం ముస్తాబైన 'ఒంటెలు'
TAGGED:
minister satyavathi rathode