దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్, హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. మహబూబాబాద్ శనిగపురంలో హత్యకు గురైన దీక్షిత్‌రెడ్డి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని బాలుడి తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
సాంకేతికతతో దారుణానికి ఒడిగట్టడం బాధాకరమన్నారు. దీక్షిత్‌రెడ్డి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఇలాంటి దారుణాలకు పాల్పడేవారికి సమాజంలో చోటులేదని మండిపడ్డారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దీక్షిత్‌రెడ్డి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీనిచ్చారు. విదేశీ యాప్‌లతో నేరాలకు పాల్పడకుండా పటిష్ట వ్యవస్థను తీసుకురావాలని తెలిపారు.
దీక్షిత్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాం: మంత్రి సత్యవతి సంబంధిత కథనాలు...
- జర్నలిస్టు కుమారుడి కిడ్నాప్.. రూ. 45 లక్షలు డిమాండ్!
- తండ్రి స్నేహితులే కిడ్నాప్ చేశారా?
- 24 గంటలు దాటినా లభించని బాలుడి ఆచూకీ
- మహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు హత్య
- కిడ్నాప్ చేసిన గంటకే బాలుడి హత్య: ఎస్పీ కోటిరెడ్డి
- బాలుడి కిడ్నాప్ దృశ్యాలు.. ఇదిగో లైవ్ వీడియో..