మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నుంచి 10 కుటుంబాల వారు మహబూబాబాద్ మండలం మల్యాలలోని మిర్చి తోటల్లో పనులకు వచ్చారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించడం వల్ల వారికి ఉపాధి కరువైంది. ఫలితంగా సుమారు 400 కి.మీ. దూరంలోని తమ సొంతూళ్లకు బయలుదేరారు.
ఆదివారం అమనగల్ సమీపంలోని ఓ చెట్టుకింద కూర్చుని ఉండగా వీరిని ‘ఈనాడు-ఈటీవీ’ ప్రతినిధి గమనించారు. విషయాన్ని మంత్రి సత్యవతి రాఠోడ్‌కు చెప్పడం వల్ల ఆమె మహబూబాబాద్ డీఎస్పీ నరేశ్‌కుమార్‌ను పంపించారు. తర్వాత మంత్రి వచ్చి, ఇక్కడే ఉండమని కూలీలకు నచ్చజెప్పారు. రూ.10 వేలు అందించి అమనగల్ ఉన్నత పాఠశాలలో వసతి ఏర్పాట్లు చేయించారు.