వ్యాధి లక్షణాలను గుర్తించేందుకు గ్రామాల్లో ఫీవర్ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని మంత్రి సత్యవతి రాఠోడ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా వారిని పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేయాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్‌లోని కొవిడ్ ఐసోలేషన్ సెంటర్‌ను ఆమె తనిఖీ చేశారు.
లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందించండి: సత్యవతి రాఠోడ్ - మంత్రి సత్యవతి రాఠోడ్
కొవిడ్ లక్షణాలు ఉన్నవారిని త్వరగా గుర్తించి మానిటరింగ్ చేయాలని మంత్రి సత్యవతి రాఠోడ్ వైద్యసిబ్బందికి సూచించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్‌లోని కొవిడ్ ఐసోలేషన్ సెంటర్‌ను ఆమె తనిఖీ చేశారు. బాధితులకు అందిస్తున్న చికిత్సలపై మంత్రి ఆరా తీశారు.
వైద్యసిబ్బందికి సూచనలిస్తున్న మంత్రి సత్యవతి రాఠోడ్
కొవిడ్ చికిత్స అందిస్తున్న తీరుపై వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. లక్షణాలు ఉన్నవారికి, ఇతరులకు వేరువేరుగా వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం కరోనా బాధితులకు పండ్లుపంపిణీ చేసి వారిలో ధైర్యాన్ని నింపారు. మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రభుత్వానికి ప్రజలంతా సహకరించి ఇళ్లలోనే ఉండాలని సత్యవతి రాఠోడ్ సూచించారు.