రాష్ట్ర రైతు నాయకులు సోల్లేటి జైపాల్ రెడ్డి తల్లి అమృతమ్మ ( 101) మృతి చెందడంతో మంత్రి సత్యవతి రాఠోడ్ పరామర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిశారు.
జైపాల్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి - మహబూబాబాద్ జిల్లా వార్తలు
రాష్ట్ర రైతు నాయకుడు సోల్లేటి జైపాల్ రెడ్డి కుటుంబాన్ని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పరామర్శించారు. ఆయన తల్లి అమృతమ్మ(101) ఇటీవలే మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలోని వారి నివాసానికి వెళ్లి సంతాపం ప్రకటించారు.
నివాళులర్పిస్తున్న మంత్రి సత్యవతి రాఠోడ్
అక్కడే వారి మాతృమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి సంతాపం ప్రకటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి ఆకాంక్షించారు. మంత్రితో పాటు తెరాస నేతలు శ్రీరంగారెడ్డి, మధుకర్ రెడ్డి, నవీన్ రెడ్డి, ఇతరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Last Updated : Jan 17, 2021, 8:38 PM IST