మహబూబాబాద్ జిల్లా 3 గ్రామాలకు చెందిన ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కావడం వల్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తొర్రూర్లో సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డి, డీఎంహెచ్వో, ఇతర అధికారులు పాల్గొన్నారు. అయితే ఆ ఐదుగురు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినట్లు తెలిపారు.
ప్రస్తుత పరిస్థితి నుంచి మరొకరికి కరోనా సోకకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. వైరస్ నిర్ధరణ అయిన మూడు గ్రామాలను క్వారంటైన్ చేయాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్యపర్చాలని సూచించారు. అలాగే క్వారంటైన్ చేసిన గ్రామాలకు నిత్యావసరాల సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.